బ్రిటన్ ప్రధాని బోరిస్ పర్యటన రద్దు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యే సూచనలు

New Delhi: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు అయింది. ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన జాన్సన్ కరోనా కారణంగా రాలేకపోయారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ కోసం ఆయన ఈ నెల చివరి వారంలో భారత్లో పర్యటించాలని నిర్ణయించారు, కరోనా మళ్లీ తీవ్రం కావడంతో పర్యటనను కుదించుకున్నారు. తాజాగా కరోనా కేసులు తగ్గకపోవడంతో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు భారత ప్రధాని మోదీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు
తాజా బిజినెస్ వార్తల కోసం:. https://www.vaartha.com/news/business/