కరీంనగర్లోనూ టిఆర్ఎస్దే హవా
ఇప్పటివరకూ 14 స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం

కరీంనగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఎన్నికలో కారు దూసుకుపోతోందనే చెప్పాలి. 33వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు 1986 ఓట్లతో ఘనవిజయం సాధించారు. . 60వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి రమణారావు 801 ఓట్లతో గెలిచారు. కాగా, 8వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు 4 డివిజన్లలో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి టిఆర్ఎస్ 12స్థానాల్లో ముందంజలో ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు కాగా, 58 డివిజన్లకు కౌంటింగ్ ప్రక్రియ సోమవారం కొనసాగుతోంది. కాగా రెండు డివిజన్లు టిఆర్ఎస్ ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటివరకు టిఆర్ఎస్ 14, కాంగ్రెస్ 01, బిజెపి 06, ఇతరులు 01 స్థానాల్లో విజయం సాధించించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/