22వ రోజు కొనసాగుతున్న రైతుల నిరసన

మందడంలో రైతులు టెంట్‌ వేసేందుకు యత్నించగా అడ్డుకున్న పోలీసులు

amaravati-farmers-protest
amaravati-farmers-protest

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు టెంట్‌ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, మహిళలు రహదారిపైనే భైఠాయించి ఎండలోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతి కోసం ఎండను సైతం లెక్కచేయమని దీక్ష కొనసాగిస్తామని రైతులు అన్నారు. మండడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలు కొనసాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయానికి వెళ్లే మార్గంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/