ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఆదేశాలు

ap-high-court
ap-high-court

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. వచ్చే నెల 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్‌ను హైకోర్టు ఆమోదించింది. 59.85 రిజర్వేషన్ల అమలుపై స్టే ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/