సినీ నిర్మాత అశ్వనీదత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

రూ. 210 కోట్ల పరిహారం ఇప్పించాలన్న అశ్వనీదత్

ap high court
ap high court

అమరావతి: సినీ నిర్మాత అశ్వనీదత్ విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ కోసం భూములు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఏపి హైకోర్టును ఆయన ఆశ్రయించారు. అయితే ఆ కాంట్రాక్టు నుంచి ప్రస్తుత ప్రభుత్వం వైదొలగడంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని తన పిటిషన్ లో అశ్వనీదత్ పేర్కొన్నారు. అశ్వనీదత్ తరపున ప్రముఖ లాయర్ జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

అశ్వనీదత్ కు ఏడాదిగా ప్రభుత్వం లీజును కూడా చెల్లించలేదని రవిశంకర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరితో అశ్వనీదత్ ఎంతో నష్టపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫైనల్ కౌంటర్లను దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీయేలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 40 ఎకరాల భూమిని విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వనీదత్ ఇచ్చారు. దీనికి బదులుగా అమరావతిలో ఆయనకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకోవడంతో తనకు తీరని నష్టం వాటిల్లిందని… ప్రభుత్వం నుంచి రూ. 210 కోట్ల పరిహారాన్ని వెంటనే ఇప్పించాలని హైకోర్టును అశ్వనీదత్ ఆశ్రయించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/