ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ కార్యక్రమం వాయిదా

నందమూరి తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీ ని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పలువురు రోడ్డు ప్రమాదాలతో మరణిస్తే..మరికొంతమంది అనారోగ్య సమస్యలతో , ఇతర కారణాలతో చనిపోయారు. నందమూరి ఫ్యామిలీ కే ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక తారకరత్న మృతి వల్ల ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

కొరటాల శివ – ఎన్టీఆర్ ల కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారెంజ్ తర్వాత వీరి కాంబోలో మూవీ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. వాస్తవానికి ఈ మూవీ ఇప్పటికే సెట్స్ ఫై వెళ్లాల్సి ఉండగా..పలు కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి 24వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలను వాయిదా వేశారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య తారకరత్న మృతి చెందడంతో ఈ సినిమా ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ కు తారకరత్న అంటే చాలా ప్రేమ ఉండడంతో.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి చాలా కుంగిపోతున్నారు.బెంగళూరులోని ఆస్పత్రిలో ఉండగా కూడా.. చాలా సార్లు ఆయన అక్కడకు వెళ్లి తారక రత్నను చూసి వచ్చారు. కానీ ఆయన చనిపోయారన్న వార్త తెలిసి తీవ్ర విషాధానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు.

అయితే సోదరుడి అంత్యక్రియలు పూర్తి అయి.. ఆయన ఈ బాధ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన తరువాతి సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.