టీడీపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసే పని అదేనట

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి నుండే అధినేత ప్రజల్లోకి వెళ్తూ వారికీ పలు హామీలు ఇస్తూ నమ్మకం కలిగిస్తున్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో ఇదేం ఖర్మ మన బీసీలకు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భాంగా వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తాను నేరుగా తెలుసుకుని న్యాయం చేసేందుకు సమీక్ష చేస్తున్నాను తెలిపారు. బీసీల్లో 140 పైగా కులాలు ఉన్నాయని.. టీడీపీకి బీసీలే వెన్నెముక అన్నారు. బీసీలకు న్యాయం చేసే వరకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలు కోల్పోయిన ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లించి మీ తీర్చుకుంటా ప్రతిజ్ణ చేస్తున్నాను అన్నారు. బీసీల సంక్షేమానికి సంబంధించిన అంశంపైనే తొలి సంతకం పెడతాను అని స్పష్టం చేసారు. వైస్సార్సీపీ వచ్చి నాలుగేళ్లైంది.. ఒక్క బీసీకైనా రూపాయి రుణం ఇచ్చాడా ఈ సీఎం అని ప్రశ్నించారు. బీసీలకు విదేశీ విద్య, బెస్ట్ అవెయిల్ బుల్ స్కూళ్లు లేకుండా రద్దు చేశారని.. బీసీల ద్రోహి జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని బీసీలు కంకణం కట్టుకోవాలన్నారు. తనను నమ్మిన వాళ్లకు అండగా ఉంటా. టీడీపీకి అండగా నిలిచిన వారిపై ప్రత్యేకంగా శ్రద్ద పెడతామన్నారు. ప్రతి వర్గానికి చెందిన వారివద్దకు వెళ్లి సమస్యలు అధ్యయనం చేసి ప్రణాళికి సిద్ధం చేయాలని.. ఎన్నికలకు ముందు మీరు రూపొందించిన ప్రణాళికలు తనకు ఇవ్వాలని కోరారు.. మేనిఫెస్టోలో పెడతాం. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసేలా కృషి చేస్తామన్నారు.