తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 1,60,571

తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు
telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,058 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,60,571కు చేరింది. తాజాగా మరో 2,180 మంది కోలుకోగా.. 1,29,187 మంది ఇండ్లకు చేరుకున్నారని చెప్పింది. వైరస్‌ ప్రభావంతో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఇప్పటి వరకు 984 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.45శాతంగా ఉందని వివరించింది. 23,534 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. సోమవారం 51,247 నమూనాలు పరిశీలించగా, మొత్తం 22,20,586 టెస్టులు చేసినట్లు తెలిపింది.

తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/