నాని తో రొమాన్స్ చేయబోతున్న సీత..

సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాగూర్‌..నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతారామం మూవీ తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ పట్టిపడేసింది మృణాల్‌ ఠాగూర్‌. ఈ మూవీ తో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నప్పటికీ కథలో తన పాత్ర బట్టి ఓకే చెపుతుంది. ఈ క్రమంలో నాని 30 వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం నాని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకి చేరుకుంది. దాంతో వచ్చే ఏడాది ఆరంభంలోనే తన నెక్ట్స్ సినిమాని నాని స్టార్ట్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌గా ద్వారా అభిమానులకి తెలియజేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డా.విజయేందర్‌రెడ్డి తీగల, మూర్తి.కె.ఎస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు జ‌న‌వ‌రి 1న సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కి అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ లో నాని కి జోడిగా మృణాల్‌ ఠాగూర్‌ నటిస్తున్నట్లు సమాచారం.