నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులు జమ

ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15 వేలు జమ చేయనుంది సర్కార్. సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే బటన్ నొక్కి ఈబీసీ నేస్తం డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ పథకంతో రూ.45 ఆర్థిక చేయూత అందిచనుంది జగన్‌ సర్కార్‌. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక తోడ్పాటు అందివ్వనుంది. ఈ పథకంపై ఇప్పటికే ఆ వర్గానికి చెందిన ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.