పవన్ కళ్యాణ్ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సెల్ఫీ

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సెల్ఫీ దిగారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు బిజీగా గడిపారు. ఈ నాల్గు రోజులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. దీంతో వివిధ పార్టీల నేతలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పవన్ ను కలిసి ఆయనతో సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలవిడిది పూర్తి కావడం తో శుక్రవారం ఢిల్లీ పయనమయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది శీతాకాల విడిది షెడ్యూల్ లో భాగంగా 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు.

డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. నిన్న నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు.