తెలంగాణలో మరో 1,590 మందికి కరోనా

295కి చేరిన మృతుల సంఖ్య

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం 1,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 23,902 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 295 మంది కరోనాతో చనిపోయారు. కరోనా సోకి చికిత్స పొంది 1,166మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 15, 703 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,277 మందికి పాజిటివ్ రాగా మేడ్చల్ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సూర్యాపేటలో 23, సంగారెడ్డిలో 19, మహబూబ్ నగర్‌లో 19, నల్గొండలో 14, కరీంనగర్‌లో 4, వనపర్తిలో 4, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 3, భద్రాద్రి కొత్తగూడెంలో 2, జనగాంలో 2,కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/