ఆహార ప్రభావంతో భావోద్రేకాలు
ఆహారం-ఆరోగ్యం-జీవన శైలి

ఆహారం మన భావోద్వేగాలపై ప్రభావితం చూపుతాయనేది వాస్తవం. టైమ్‌కి భోజనం లేకపోతే అసహనం, కోపం వస్తుంది. విసుగుదల పుడుతుంది. పల్లవి విషయంలో ఇదే జరిగింది.
ఎందుకో పల్లవి ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి చికాకుపడిపోతోంది. పిల్లల మీద విసుక్కోవటమే కాదు కారణం లేకుండానే వారిపై చేయి చేసుకుంటోంది.
ఇక భర్తతో అయినదానికీ కానిదానికీ వాదిస్తోం ది. ఆఫీసులోనూ తోటిఉద్యోగులతో గొడవలవ్ఞతున్నాయి. స్నేహితులు కూడా ఆమె ప్రవర్తన చూసి చిన్నబుచ్చుకుంటున్నారు.
గతంలో ఎప్పుడూ లేనిది ఎందుకింత కోపమొస్తోందో ఆమెకు అర్థంకాక సైకాలజిస్టు సలహాకోసం వెళ్లింది.
ఆమె దినచర్యా, అలవాట్లూ, అభిరుచులూ, ఇంట్లోనూ బయటా ఆమె నిర్వహి స్తున్న బాధ్యతలూ అన్నింటి గురించీ ఆరాతీసిన సైకాలజిస్టు ఆమెను బ్లడ్‌షుగర్ పరీక్ష చేయించుకోమనీ అలాగే ఒకసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించమనీ చెప్పాడు.
చీటికీమాటికీ కోపమెందుకొస్తోందో చెప్పమంటే డైటీషియన్ దగ్గరికి వెళ్లమంటాడేమిటీ అనుకున్న పల్లవికి ఆ డాక్టర్ మీద చర్రున కోపం వచ్చింది.
మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలూ మాంసకృత్తులూ కొవ్ఞ్వ పదార్థాలూ అన్నీ జీర్ణమై గ్లూకోజు, అమైనో ఆసిడ్లు, ఫ్రీఫ్యాటీ ఆసిడ్లుగా మారి రక్తంలో కలిపి అన్ని అవయవాలకీ సరఫరా అవుతాయి. అవి పని చేయడానికి కావలసిన శక్తినిస్తాయి.
ఆహారం తీసుకున్న తర్వాత సమయం గడిచేకొద్దీ ఈ సరఫరా తగ్గిపోతుంది. అందుకే ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే రక్తంలో ఇలా శక్తి నిచ్చే చక్కెర (గ్లూకోజ్) స్థాయి తగ్గిపోతుంది.
అది మరీ తక్కువ స్థాయికి పడిపోతే మెదడు వెంటనే అప్రమత్తమై అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని అవయవాలన్నిటికీ సూచనలిచ్చేస్తుంది.
దాంతో అప్పటికప్పుడు నాలుగురకాల హార్మోనుతయారవుతాయి.
పిట్యూటరీ గ్రంథి నుంచి గ్రోత్‌హార్మోన్లు, క్లోమగ్రంథి నుంచి గ్లూకజాన్తో పాటు కార్టిసోల్, అక్రెనలైన్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు కూడా విడుదలై రక్తంలో కలిసి తగ్గిన చక్కెర స్థాయిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి.
ఇలా విడుదలయ్యే కార్టిసోల్ కొంతమందిలో దురుసు ప్రవర్తనకు కారణమవ్ఞతుంది.
ఇక అడ్రెనలైన్ పేరే పైట్ ఆర్ ఫ్లైట్హార్మోన్ మన భద్రతకి ముప్పు పొంచి ఉందనిపించి నప్పుడు ఎదురు తిరిగి రావడమో లేదా అక్కడి నుంచి పారిపోమ్మనో చెబుతుందని దానికా పేరు పెట్టారు.
రక్తంలో చక్కెరస్థాయి చాలా తక్కువగా ఉంటే మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది. సభ్యత మరిచి గట్టిగా కేకలు వేయడమూ, నోటి కొచ్చినట్లు మాట్లాడటమూ చేస్తారు.
సాధారణంగా అల సిపోయి ఉన్నప్పుడో అనారోగ్యంగా ఉన్నప్పుడో కొంతవరకు విచక్షణ కోల్పోవడం చూస్తాం. కానీ దానికీ ఈ ప్రవర్తనకి తేడా ఉంటుంది.
మామూలుగా కోపం వస్తే లాజికల్‌గా ప్రశ్నించడమూ లేదా గట్టిగా నాలుగు కేకలు వేసి పని జరిపించుకోవడమూ, అలిగి మాట్లాడకుండా వ్ఞండడం ఇలా సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు. ఆకలి కోపంతో చేసే పనుల్లో సమన్వయం కన్పించదు. మాటలూ తడబడతాయి.
కోపమే కాదు, ఇంకా చాలా కనిపిస్తాయి. ఆకలి అందరికీ వేస్తుంది. కోపమూ అందరికీ వస్తుంది. రెండూ కలిసి ఒకేసారి దాని చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిని కూడా కొందరు సమర్థంగానే ఎదుర్కొనలుగుతారు.

కోపాన్ని నియంత్రించుకునే అలవాటు లేనివారూ ప్రతి చిన్నదానికీ తీవ్రంగా స్పందించేవారూ ‘హ్యాంగ్రీకి ఎక్కువగా లోనవ్ఞతారు అంటు న్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ పరిశోధకురాలైన డాక్టర్ క్రిస్టీన్ లీ.
ఆకలి వల్ల ఒక్క కోపం రావడం వ్ఞండదు కాబట్టి ఆకలి లేదనుకోవద్దు. నిస్సత్తువ, నిద్రమత్తు, దేనిమీదా దృష్టిపెట్టలేకపోవడం, చేసే పనుల్లో సమన్వయం లోపించడం, మాట తడబడడం, పనిలో తరచుగా పొరపాట్లు చేయడం లాంటి లక్షణాలన్నీ ఆకలి మల్లేనంటారామె.
ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడైనా ఓసారి ఆకలి కోపాన్ని ఎదుర్కొంటే దాన్ని సమస్యగా భావించనక్కర్లేదు.
అలా కాకుండా ఇతరత్రా ఏ రకమైన అనారోగ్యమైనా ఉంటే మాత్రం ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు.
అనారోగ్యానికి మందులు వాడుతున్నవారూ రక్తహీనత, పోషకాహార లేమితో బాధపడుతున్నవారూ కోపం వచ్చే దాకా ఆకలిని గుర్తించకపోతే తీవ్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
మధుమేహం, క్లోమగ్రంథి లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలూ అడ్రినల్ ఇన్సఫిషియెన్సీ సిండ్రోమ్స్ ఉన్నవారికీ రక్తంలో ఇలా చక్కెరస్థాయులు మరీ తక్కువగా పడిపోతే ప్రమాద మేనంటున్నారు
నిపుణులు. ఈ కోపానికి కారణం ఆకలే అయినా దానికి దారితీసే పరిస్థితులు చాలారకాలుగా ఉండవచ్చు.
ఆరోగ్యంగా ఉండటమటే ఇన్నాళ్లూ బరువుసరిగ్గా ఉంటే చాలనుకునేవాళ్లమనీ ఇప్పుడు మారుతున్న ఆహారపుటలవాట్ల వల్ల మరెన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాల్సివస్తోందినీ అంటారు
పోషకాహార నిపుణులు. చాలాసార్లు మనం తీసుకునే ఆహారంలో కెలొరీలు ఉంటున్నాయి కానీ పోషకాలూ, విటమిన్లూ ఉండడం లేదు. కెలొరీల వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుండి వేరే ఏమీ తినాలనిపించదు.
ఫలితంగా పోషకాహార లేమితో సమస్యలు వస్తున్నాయనీ, కోపానికి తోడు చురుకుదనం తగ్గడమూ స్థామినా లేకపోవడమూ దని వల్లనేననీ చెబుతారు డాక్టర్ జానకి.
ఇక ఈ ఆకలికోపానికి దారితీస్తున్న రకరకాల పరిస్థితుల విషయానికి వస్తే. ఒకప్పుడు మూడుపూటలా కడుపునిండా తినేవాళ్లం. అలాగే శారీరక శ్రమా ఎక్కువే చేసేవాళ్లం.
ఇప్పుడు తీసు కునే ఆహారంలోనూ, తినే పద్ధతులోలనూ మార్పు వచ్చింది. కడుపునిండా తినాల్సిన అల్పాహారాన్ని కొందరు నిర్లక్ష్యం చేస్తే, తక్కువగా తీసుకోవాల్సిన రాత్రి భోజనానికి కొందరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇలాంటి అలవాట్లు శరీరంలో గ్లూకోజ్స్థాయుల్ని స్థిరంగా ఉండని వ్వవ్ఞ. ఎక్కువ గంటలు పనిచేసేవాళ్లకీ, తీవ్రమైన పనిఒత్తిడితో సమతమమ య్యేవారికీ భోజనానికి భోజనానికి మధ్య చాలా విరామం ఉంటుంది.
చాలామంది గృహిణులు పొద్దునే వంట చేసిపిల్లల్ని పంపించే హడావు డిలో తొమ్మిదీ పదిగంటల వరకూ గ్లాసుడు మంచినీళ్లు కూడా తాడరు.
ఇలాంటి అలవాట్లన్నీ పరోక్షంగా మెదడు మీదా తద్వారా మళ్లీ శరీరం మీదా ప్రభావం చూపుతాయి. యువతలో, పిల్లల్లో ఫాస్ట్‌పుడ్ తినడమూ ఆకలికోపానికి మరో కారణమవుతోంది.
ఫాస్ట్‌ఫుడ్‌లో ఎక్కువ కెలొరీలు ఉంటాయి. వాటిని కరిగించే వ్యాయామం మాత్రం వారికి ఉండటం లేదు. శరీరంలోకి ఎక్కువ కెలొరీలు చేరగానే మెదడు వాటిని కొవ్వు రూపంలో నిల్వచేయమని సూచనలిస్తుంది.
దాంతో బరువ్ఞ పెరగడమూ స్థూలకాయానికి దారితీయడ మూ జరుగుతుంది. ఇలాంటివారు చూడటానికి నిండుగా కన్పిస్తారు. కానీ లోపల మాత్రం శక్తి ఉండదు.
మెదడుకి అవసరమైన సూక్ష్మపోషకాలు అందకపోవడంతో ఉత్సాహం తగ్గుతుంది.
పట్టుమని ఇ అడుగులు వేస్తే అలసిపోతారు. వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి చూపరు. ఎవరైనా ఆ విషయాన్ని ఎత్తి చూపితే కోపంతో గట్టిగా అరిచేస్తారు.
డైటింగ్:
డైటింగ్ చేసేవారిలోనూ ఆకలి కోపం ఎక్కువే. బరువు తగ్గించుకోవా లనే పట్టుదలతో నోరు కట్టుకుంటారు. దాంతో ఇష్టమైన పదార్థాలను తినలేని అసంతృప్తి కోపంగా బయటపడుతుంది. అకారణంగా ఆవేశపడతారు.
నిగ్రహించుకోగలిగినంత కాలం నిగ్రహించుకుని ఒక్కసారిగా ఆహారంపైన నియంత్రణ తప్పుతారు. ఫలితం మళ్లీ గ్లూకోజ్స్థాయుల మీద పడుతుంది.
ఆకలి కోపం తాలూకు పర్యవసానాలూ చాలారకాలుగా ఉంటాయి. పెద్దల్లో అది కోపం రూపంలోనో అసహనం రూపంలోనో కన్పిస్తే పిల్లల్లో పేజీల రూపంలో బయటపడుతుంది.
ఒక్కోసారి పిల్లలు వేళకి కడుపునిండా తింటున్నా కూడా పేచీలు పెడుతున్నారంటే అది ఆకలి కోపం ఆకదనుకోవడానికి లేదు.
వారికి అవసరమైన పోషకాలేవో ఆహారం ద్వారా అందడం లేదని గ్రహించాలి అంటున్నారు. నిపుణులు. ఇక పెద్దల విషయానికి వస్తే కోపం, అసహనం, చికాకులాం టివి తరచూ కలుగుతోంటే ముందుగా ఆహారపుటలవాట్లను పరిశీలించుకోవా లంటున్నారు నిపుణులు.
ఎందుకంటే ఈ లక్షణాల ప్రభావం ఉద్యోగ, వ్యాపార, వైవాహిక బంధాల మీద పడుతుంది కాబట్టి.
ఒకసారో రెండుసార్లో అయితే సారీ చెబితే క్షమిస్తారు. కానీ అదో అలవాటుగా మారిపోతే, కోపంతో విచక్షణ కోల్పోయి మాట్లాడితే సమోద్యోగులూ పై అధికారులతో సమస్యలొస్తాయి.
చీటికీ మాటికీ కోపం తెచ్చుకునే అమ్మానాన్నలకు పిల్లలూ దూరదూరంగానే తిరుగుతారు. దాంతో మొత్తంగా ఇంట్లో ప్రేమా ఆప్యాయతలతో ఆడుతూపాడుతూ ఉంే చక్కటి వాతావరణం మాయమవుతుంది.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women