గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లలకు ఉప రాష్ట్రపతి కీలక సూచనలు

రాష్ట్రాలకు దిక్సూచిలా గవర్నర్లు పని చేయాలన్న ఉప రాష్ట్రపతి

Venkaiah Naidu
Venkaiah Naidu

న్యూఢిల్లీః భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశం నిర్వహించారు. మరో నెల రోజుల్లో వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియబోతోంది. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నతమైన పదవులను ఆయన చేపట్టారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వెంకయ్యనాయుడిను ఎన్డీయే ఎంపిక చేయలేదు. దీంతో, ఆయన రాజకీయ జీవితం సంపూర్ణంగా ముగియబోతోంది. మరోవైపు తన రాజకీయ ప్రస్థానం ముగియనున్న తరుణంలో రాష్ట్రాల గవర్నర్ లకు ఆయన కీలకమైన సూచనలు చేశారు.

గవర్నర్లు రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా పని చేయాలని వెంకయ్య అన్నారు. గవర్నర్ పదవి అనేది అలంకారప్రాయమో లేదా రాజకీయ హోదానో కాదని ఆయన చెప్పారు. వివిధ పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు చేస్తున్నాయా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందని సూచించారు. రాష్ట్రాల పాలన వ్యవహారాలు సక్రమంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్లదేనని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/