ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి…?

bjp-mla-etela-rajender-interesting-comments-on-cm-post

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రి పదవి ఇస్తుండడం తో..అధ్యక్షా బాధ్యతలు మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర క్యాబినెట్లో చోటు కోసం తెలంగాణ నుంచి దాదాపు అందరు ఎంపీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మాత్రమే మోదీ క్యాబినెట్ లో చోటు దక్కింది. దీంతో ఈటల రాజేందర్ ఒకింత అసంతృప్తి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా నుంచి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లింది.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కలవాలని ఈటలకు సూచించారు. దీంతో కాసేపటి క్రితం ఈటల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై హిమంత బిశ్వతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.