విద్యార్థులకు తీపి కబురు : ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

ఏపీలోని విద్యార్థులకు తీపి కబురు అందించిన రాష్ట్ర సర్కార్. మే 9 నుంచి వేసవి సెలవుల ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాగానే.. వేసవి సెలవులు మొదలుకాబోతున్నాయి.

అలాగే 1 నుంచి 9 వ తరగతులకు జరగాల్సిన సమ్మేటివ్‌ – 2 పరీక్షలు ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మే 4 వ తేదీ వరకు జరుగనున్నాయి. అవి కాగానే.. వాళ్లకు సెలవులు ఉంటాయి. జూలై 4 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక జూనియర్‌ కాలేజీలకు మే 25 వ తేదీ నుంచి జూన్‌ 20 వ తేదీ వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించారు. తిరిగి జూన్‌ 13న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.

ఇక.. పదో తరగతి ఫైనల్‌ పరీక్షలు మే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా కూడా పబ్లిక్‌ పరీక్షల దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో 10వ తరగతి వారికి బోధించే ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.