TS పేరు మార్పు ఖర్చు ఫై కాంగ్రెస్ క్లారిటీ

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా TS ను కాస్త TG గా మార్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ లోగోను , రాష్ట్ర గీతాన్ని సైతం చేంజ్ చేసింది. అయితే టీఎస్ నుండి టీజీగా మార్చడం తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,767 ఖర్చు అవుతుందని. ప్రజల డబ్బును కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తుందని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చింది. పేరు మార్పునకు రూ.2,767 కోట్ల ఖర్చు అవుతోందని సోషల్ మీడియాలో వైలర్ అవుతోన్న నోట్ ఫేక్ అని వెల్లడించింది. ఈ నోట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. అసత్య ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫేక్ నోట్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.