మోదీ క్యాబినెట్లో చోటు దక్కడం ఫై బండి సంజయ్ స్పందన

bandi-sanjay-election-campaign-at-karimnagar

మోడీ కాబినెట్ లో ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీఠం వేశారు. మొత్తం ఐదుగురికి చోటు కల్పించారు. ఏపీ నుండి ముగ్గురుకి , తెలంగాణ నుండి ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , సికిందరాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి లకు మోడీ మంత్రివర్గంలో ఛాన్స్ లభించింది.

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.