బీజేపీలో చేరడం ఫై గులాం నబీ ఆజాద్ క్లారిటీ

కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్..నెక్స్ట్ బిజెపి లో చేరబోతారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న తరుణంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను బిజెపి చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసారు. తాను బీజీపీతో అసలు టచ్‌లో లేనని .. జమ్ముకశ్మీర్లో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు.

తాను ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూడటం లేదని తెలిపారు. ఇప్పటికైతే సొంత రాష్ట్రానికే పార్టీని పరిమితం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై భవిష్యత్తులో ఆలోచిస్తానన్నారు. అయితే తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఆజాద్ ఎలాంటి వివరాలు తెలుపలేదు.

ఇదిలా ఉంటె గులాం నబీ ఆజాద్ తన రాజీనామా పట్ల కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై బిజెపి తో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని తెలిపింది. అలాగే ఈ రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిందని గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో సంప్రదింపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ చురకలు అంటించారు గులాంనబీ ఆజాద్.రాహుల్‌ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీకి రాజకీయ పరి పక్వత లేదని విమర్శలు చేశారు.