2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందిః ప్రధాని మోడీ

Technology use will help India become developed nation by 2047, says PM Modi

న్యూఢిల్లీః దేశ పౌరుల జీవితాలను మార్చడంలో సాంకేతికత చాలా అవసరం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ యూజ్ టెక్నాలజీ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో మాట్లాడిన మోడీ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి పరిష్కరించగల పది సమస్యలను పౌరులు గుర్తించాలని కోరారు. వన్ నేషన్ వన్ రేషన్, ఆరోగ్య సేతు, మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ప్రభుత్వంతో ప్రజల కమ్యూనికేషన్ ను సులభం చేశాయన్నారు. 2024 కల్లా ఏఐ ఆధారిత రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైద్య, విద్య, వ్యవసాయం పరిశ్రమల్లో 5జీ, ఏఐ విస్తరణ అవసరమని, డిజిలాకర్ వంటి సేవలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారుల కోసం జెమ్ పొర్టల్, రైతుల అనుసంధానం కోసం ఈ-నామ్ ని తీసుకొచ్చామన్నారు.