అమిత్ షాతో తెలంగాణ బిజెపి లీడర్లు భేటీ

telangana-bjp-leaders-meeting-with-amit-shah

న్యూఢిల్లీః రాష్ట్ర ముఖ్య నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమయ్యారు . బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారని తెలుస్తోంది.