క‌రోనాపై స‌మ‌రానికి రూ.4 కోట్లు విరాళం

దేశంలో పెద్ద మొత్తంలో విరాళం ప్ర‌క‌టించిన ఏకైక న‌టుడు ప్ర‌భాస్

Hero Prabhas

క‌రోనాపై స‌మ‌రానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ రూ .4 కోట్లు విరాళం ప్రకటించారు..

ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్ర‌క‌టించిన భార‌త దేశంలో ఏకైక న‌టుడు ప్ర‌భాస్ కావ‌డం విశేషం..

ఈ నాలుగు కోట్ల‌లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌హాయ నిధికి రూ 50 ల‌క్ష‌లు చొప్పున‌, మిగ‌తా మూడు కోట్ల రూపాయ‌లు ప్ర‌ధాన మంత్రి స‌హాయ నిధికి అంద‌జేయ‌నున్నారు .

లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది.

పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/