గద్వాల్ జిలాల్లో బాలికలఫై హెచ్ఎం లైంగిక వేదింపులు

ఉన్నత విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు…కామాందులుగా మారుతున్నారు. ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగ..తాజాగా గద్వాల జిల్లా అనంతపురం ప్రాథమికోన్నత బడిలో బాలికలతో హెచ్ఎం వెంకటేశ్వర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతున్నాడు. బూతులు మాట్లాడుతూ పిల్లల పలకలపై అసభ్య పదాలు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

దీంతో బాలికలు విషయాన్ని తమ పేరెంట్స్ కు చెప్పడంతో వారు మంగళవారం స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా హెచ్ఎంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు స్కూల్ కు చేరుకొని హెచ్ఎంను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నామని ఎంఈఓ సురేష్ తెలిపారు. ఆ టీచర్ ను సస్పెండ్ చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.