పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారం భం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారం భం కానున్నాయి. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యులకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ హాల్‌లో 144 మందికి సీటింగ్ సౌకర్యం ఉంది. మంత్రులు, వివిధ కమిటీల చైర్‌పర్సన్స్, వివిధ పార్టీల నేతలు, మాజీ ప్రధానులు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ జాతీ య అధ్యక్షులు ఇక్కడ ఆసీనులవుతారు. మిగతా ఎంపీ లు రాజ్యసభ, లోక్‌సభలోని చాంబర్లలో కూర్చుంటారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు రాజ్యసభ 3గంటలకు సమావే శం అవుతుంది. మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు సమావేశమవుతుంది. లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భేటీ అవు తుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మార్చి 8 నుంచి ఏప్రిల్ 18 వరకు రెండు విడతలుగా సెషన్స్ జరగనున్నాయి.
మొత్తం 33 రోజులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌తోపాటు సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. సమావేశాల తో సంబంధం కలిగిన 494 మంది రాజ్యసభ సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/