అర్ధరాత్రి బైంసాలో ఉద్రిక్తత..

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసారు. కానీ మంగళవారం అర్ధరాత్రి భైంసాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో డబ్బుల డంప్ ఉందనే సమాచారం మేరకు ఎఫ్ఎస్‌టీ టీమ్‌తో పోలీసులు సోదాలు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

తమ దగ్గర డబ్బులు లేవని బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆపై జరిగిన దాడిలో పలువురు పోలీసులకు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పలు కార్ల అద్దాలు ద్వంసం అయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.