పిల్లలకు వినయం నేర్పాలి..

చిన్నారుల పెంపకం – తల్లిదండ్రుల బాధ్యతలు

చిన్నారులకు కావాల్సినవి అన్నీ సమకూర్చటంతో మన బాధ్యత తీరిపోదు.. వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం చాలా అవసరం… వాళ్ళు నిజాయతీ అలవర్చుకోవటం ఎంత ముఖ్యమో వినయంగా ఉండటమూ అంతే అవసరం.. ‘ నాకిది కావాల్సిందే ‘ అని రుబాబుగా అడిగితే ఇవ్వాలన్నది కూడా ఇవ్వాలనిపించదు . పద్దతిగా ఒద్దికగా అడిగితే సాధ్యం కానిది కూడా కస్టపడి తెచ్చి ఇవ్వాలనిపిస్తుంది. ఈ విషయం , విధేయత చిన్నతనం లోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.


అహంకారం , గర్వం ఎంత హాని చేస్తాయో కధల రూపంలో పిల్లలకు చెప్పాలి.. సున్నితంగా మాట్లాడితేనే అభిమానం, ఆదరణ దొరుకుతాయి.. కటువుగా మాట్లాడితే ఆత్మీయత దొరకదు.. ఒంటరితనంతో బాధ పడాల్సి వస్తుందని అర్ధం అయ్యేలా చెప్పండి..

పెద్దలను గౌరవించే పద్ధతులు చిన్నప్పుడే అలవాటు చేయాలి.. లేదంటే భవిష్యత్తులో అనర్ధాలు తప్పవని, అందరూ దూరం పెడతారని ఉదాహరణలతో వివరించండి. వయసుకు, విజ్ఞానానికి మర్యాద ఇవ్వాలంటూ పెద్దలు ఆచరించి చూపితే పల్లాలూ అనుసరిస్తారు..
అందరితోనూ సౌమ్యంగా మాట్లాడాలని, ముఖ్యంగా పెద్దలను గౌరవించాలని, ఒద్దికగా ఉంటూ వాళ్ళ అనుభవసారం నుంచి పాఠాలు నేర్చుకోవాలని తెలియజెప్పాలి.. మర్యాద, మన్ననలతో దేనినైనా సాధించవచ్చని చిన్నారులకు వివరించండి.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/