కావాల్సినంత శ్రమ అవసరం..

ఆహారపు అలవాట్లు-ఆరోగ్య పరిరక్షణ

House Wife
House Wife

ఒకప్పుడు మహిళలు ఇంటిపట్టునే ఉండేవారు కాబట్టి ఇంటిపనులను స్వయంగా చేసుకునేవారు. ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేసేసం ఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దీంతో ఇంటిపనులను చేసుకునే సమ యం లేక పని మనుషులపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆఫీసులో కూర్చోనే ఉండడం, ఇంటి పనులు చేసే టైమ్‌ లేక పోవడంతో శరీరంలో కొవ్వు పేరుకునిపోతున్నది. దేహానికి కావాల్సినంత శ్రమ, ఎక్సర్‌సైజులు లేకపోవడం వల్ల సుల భంగా లావైపోతున్నారు. దీనికితోడు ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా స్థూలకాయానికి గురవుతున్నారు.

ఆధునిక కాలపు స్త్రీలు ఉద్యోగరీత్యా ఉరు కులు పరుగులతో జీవ నాన్ని గడుపుతూ సమ యానికి ఆహారం తీసుకోక పోవడం, అందుబాటు లో పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ ఫుడ్‌ తినేయడం వంటి అంశాల కారణంగా అధిక బరువ్ఞకు గురవుతున్నారు.

ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరే అధిక కేలరీలు శరీరాకృతిని దెబ్బతీయడమే కాక, ఇ రత్రా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంటాయి.

స్త్రీలలో గుండె జబ్బులు, లైపిడ్‌ లోపాలు, రక్తంలో చక్కెర శాతం అపక్రమాలు, హార్మోన్ల అసమతుల్య, గర్భధా రణ తదితర అనేక ఇక్కట్లకు స్థూలకాయం కారణమవుతుంది.

స్థూలకాయం సాధారణంగా అన్ని వయస్సులలోని వారిలోనూ కని పించే సమస్య అయినప్పటికీ, స్త్రీలు ముప్ఫ య్యేళ్ల వయస్సు దాటాక వారిలో ప్రధాన సమస్యగా కనిపిస్తుంటుంది.

ఈ వయస్సులో కుటుంబ బాధ్యత లు, వృత్తిపరమైన బాధ్యతల కార ణంగా వారికి తమ శరీరంపై శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదు.

స్థూలకాయం నుంచి స్త్రీలు బైటపడటానికి చేసే అనేక ప్రయత్నాలు సాధారణంగా వ్యర్థంగా మారుతుంటాయి. దీంతో వారు నలుగురిలోకి రావడానికి సంకోచిస్తారు. ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లడం మానేస్తారు.

బరువు తగ్గడానికి ఉపకరించే కొన్ని అంశాలు మీకోసం…

జీవక్రియపై దృష్టి సారించండి : మనిషి విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరం ఎంత శక్తిని వినియోగించుకుందనే విషయాన్ని బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌ (బిఎంఆర్‌) అంటారు.

విశ్రాంతి తీసుకుంటూనే శరీరంలో అధికంగా ఉన్న కేలరీలను ఖర్చు చేయడం గురించి ఆలోచించండి. మిరపకాయలు, మిరియాలలో ఉన్న కొన్ని పదార్థాలు బిఎంఆర్‌ను పెంచుతాయి.

కనుక స్వీట్లు తీసుకోవాలనుకున్నప్పుడు వాటి బదులు స్పైసీ ఆహారాన్ని తీసు కోండి. బిఎంఆర్‌ పెరగడానికి వ్యాయామం ఉపకరిస్తుంది.

పీచు పదార్థాం మంచి నేస్తం :

పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనితో ఇతర ఉపాహారాల మీదకు మనస్సు పోదు.

వ్యాయామం :

తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల కండరాలు, శరీరంలో నీరు తగ్గుతాయి. బిఎంఆర్‌ పెరగడంలో కండరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కనుక వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/