అమ్మాయికి మార్గదర్శకంగా ఉండాలి

మనస్విని: వ్యక్తిగత సమస్యలకు పరిష్కార మార్గం

Should be a guide to the girl
Should be a guide to the girl

మేడమ్‌! నా వయసు 45 సంవత్సరాలు. మా అమ్మాయి మా ఇష్టం లేకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. దానివల్ల మేము చాలా బాధపడ్డాము. అతనిది వేరే కులం. ఇప్పుడేమో విడాకులు కావాలంటోంది. ఏమి చెయ్యాలో తోచటం లేదు. విడాకులు ఇప్పించి మరల పెళ్లి చేస్తే మళ్లీ ఇలా చేస్తుందేమో అని భయంగా ఉంది. ఏం చేస్తే మా అమ్మాయి సరైన గాడిలో పడుతుందో కొంచెం వివరించండి. – ఇందుమతి

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయటపడగలరు. విజ్ఞతతో వ్యవమరించవలసి వస్తుంది. స్పష్టత చాలా చాలా అవసరం. వివేకం ఎంతో అవసరం. తొందరపాటు మంచిదికాదు.

మీరు మీ అమ్మాయికి మార్గదర్శకులుగా ఉండాలి. దండించవద్దు. దూషించవద్దు.

కౌన్సిలింగ్‌ ఇప్పించండి. మీరు కూడా కౌన్సిలింగ్‌ తీసుకోండి. నిపుణుల లహాలు ఎంతో మేలు చేస్తాయి. సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.

అన్నింటికీ మించి మీ అమ్మాయిని ప్రేమతో దగ్గరకు తీసుకోండి. ఆమెను ఆదరించండి.

పిల్లలు, పెద్దలు అందరూ తప్పులు చేయడం మామూలే. వానిని సరిదిద్దే మార్గం చూడండి. పిల్లలతో స్నేహంగా, ప్రేమగా మెలగాలి. కోప్పడవద్దు.

కోపంతో దూరం అయిపోతారు. అందువల్ల చక్కగా తెలియచెయ్యాలి. మీ అనుభవంతో వారికి చక్కని పాఠాలు నేర్పాలి.

తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రుల నుండి ఎంతో నేర్చుకుంటారు. గృహ వాతావరణం ఆనందంగా మలచుకోవాలి. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.

మీ అమ్మాయి కాపురం సరిదిద్దండి. అది వీలు కాకపోతే విడాకులు తీసుకోవచ్చు.

మంచి వరున్ని చూసి, పునర్వివాహం చేయవచ్చు. కానీ జాగ్రత్తగా వరున్ని చూడాలి. అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ అమ్మాయి సంసిద్ధత కూడా చూడాలి.

ఉద్వేగపరంగా ఆనందంగా ఉండాలి. వర్తమానంలో సరియైన సమయంలో, సరియైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది తప్పక చేయవలసిన పని.

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి

మేడమ్‌! నా వయసు 54 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. పెళ్లిళ్లయ్యాయి. నా భర్త చనిపోయి 8 సంవత్సరాలైంది. నాకు ఒంటరిగా అనిపిస్తోంది. పునర్వివాహం చేసుకోవచ్చా? కానీ ఆ ఆలోచనే భయంగా ఉంది. ఎవరు ఏమనుకుంటారో అని.

ఈ సందిగ్ధంలో పడి, నిద్రపట్టడం లేదు. ఇలానే ఒంటరి జీవితం గడపాల్సిందేనా? కొంచెం వివరించండి ప్లీజ్‌. – ప్రియంవద

మీరు తప్పక మరల వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. ఇంటర్‌నెట్‌ ద్వారా. ఎంతో మంది ఇప్పుడు పునర్వివాహం పెద్ద వయసులో కూడా చేసుకుంటున్నారు.

అది వారి ఇష్టం. వ్యక్తిగత విషయం.

ఎవరూ ఏమనుకోవటానికి వీలు లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోనవసరం లేదు. మీకు నచ్చిన వ్యక్తి ఉంటే తప్పక వివాహం చేసుకోండి.

అందులో ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. ఇప్పుడు సమాజం మారుతోంది. విశాల దృక్పథం అలవర్చుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగనంతవరకు పునర్వివాహం చేసుకోవచ్చు. మీ పిల్లల సలహాలు కూడా తీసుకోండి.

మీ స్నేహితులను, బంధువులను సంప్రదించండి. అప్పుడు మీకిష్టమైతే తప్పక మీరు తగిన వ్యక్తిని చూసి, వివాహం చేసుకోవచ్చు.

అది చట్టరీత్యా ఆమోదయోగ్యమైనదే. మీకిష్టం లేకపోతే చేసుకోవద్దు. ఒంటరితనం అనేది దృక్పథం మాత్రమే.

రోడ్డుమీదకి వస్తే సమాజంలో ఎంతో మంది కనబడుతారు. మీరు మీ స్నేహితులతో, బంధువ్ఞలతో, మీ పిల్లలతో కాలక్షేపం చేయవచ్చు. ఏదైనా వ్యాపకం కల్పించుకోవచ్చు.

సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టవచ్చు. అంతా చేతుల్లోనే ఉంది. జీవితం అమూల్యమైన వరం, కానుక.

దానిని నిరంతరం ఆనందంగా మలచుకోవటానికి ప్రయత్నించాలి. అది మీరు తప్పక చేయగలరు.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/