అరచేతిలో ఆనందం

Palm

ఒక్కోసారి దుఃఖం, భయాందోళనలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటప్పుడు సంతోష ముద్ర సాధన చేయాలి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. రెండు చేతులను తొలగపై ఉంచాలి. బొటన వేలిని మిగతా వేళ్లతో కనిపించకుండా మడవాలి. రెండు చేతులతో ఇలా చేయాలి. హాయిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా గాలిని పీల్చాలి.

ఊపిరితిత్తుల నుండి గాలి పీల్చుకుని మనసులో ‘ఓం కారాన్ని ఏడుసార్లు ఉచ్చరించాలి. మనసుని తేలిగ్గా, ప్రశాంతంగా ఉంచుకుని మెల్లిగా గాలిని బయటకు వదలాలి. ఇలా వదిలేటప్పుడు చేతి వేళ్లను విప్పాలి. ఆందోళనలు, భయాలు, దుఃఖం అన్నీ వేళ్ల చివర్ల నుంచి బయటకు వదిలేస్తున్నట్లుగా భావించాలి.

ఈ ముద్రను ఏడుసార్లు, కుదిరితే 49 సార్లు చేయాలి. ప్రతి రోజు ఈ ముద్ర సాధన చేయడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. మానసికంగా బలంగా మారతారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనుక్కునే సామర్థ్యం పెరుగుతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/