నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్

బిపర్‌జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి పెను ప్రమాదం పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది. మరోపక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అరేబియా సముద్రం మీదుగా కదులుతున్న తుపాన్ ప్రభావం చిత్రాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

నా మునుపటి వీడియోలో వాగ్దానం చేసినట్లుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాన్ చిత్రాలను నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు రోజుల పాటు క్లిక్ చేశాను’’ అని అల్ నెయాడి రాశారు.రెండు రోజుల క్రితం అల్ నెయాడి అరేబియా సముద్రం మీదుగా భారత తీరం వైపు వెళుతున్నప్పుడు ఏర్పడిన భారీ తుపాన్ ను చూపించే వీడియోను పంచుకున్నారు.‘ ‘అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్ చూడండి…సురక్షితంగా ఉండండి’’అంటూ అల్ నెయాడి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటె ఇస్లామాబాద్ – బిపర్‌జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని పాక్ మంత్రి తెలిపారు.