ఏపీలో మాటల్లేవ్.. మాట్లాడుకోవడలు లేవ్..కొట్లాడుకోవడమే అంటున్న నేతల తీరు

ఒకప్పుడు రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడిచేది..ఒకరి ఫై ఒకరు ఆరోపణలు , ప్రతి ఆరోపణలు చేసుకునేవారు..లేదంటే కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఏపీలో నేతల తీరు ఆలా లేదు.మాట్లలేవ్, మాట్లాడుకోవడలు లేవ్..ఏమైనా కొట్టుకోవడమే , బట్టలు చించుకోవడమే అన్నట్లుగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ – టీడీపీ పార్టీ నేతల మధ్య బూతు పురాణం..ప్రజల ముందే కొట్టుకోవడం, బట్టలు చించుకోవడం చేస్తూ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో అలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అధికార.. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. టీడీపీ.. వైస్సార్సీపీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. టెండర్లను అధికార పార్టీకి చెందిన వారికే కట్టబెడుతున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనిని వైస్సార్సీపీ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. అది కొట్టుకునే వరకు దారితీసింది. ఇంకేముంది సినిమాల్లో సన్నివేశాల్లో ఒకరిపై మరొకరు ఎగెరెగిరి దూకుతూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో.. పలువురు కౌన్సిలర్ల చొక్కాలు చిరిగాయి. వీరిని కట్టడిచేయలేక ఛైర్‌ పర్సన్ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘర్షణ కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.