మాజీ మంత్రి అవంతికి చేదు అనుభవం

వైసీపీ నేతలకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలుకావడం తో నేతలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఇంటింటికి వెళ్తున్న నేతలకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. తాజాగా భీమిలీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కు చేదు అనుభవం ఎదురైంది.

పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు , యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు. దీంతో అవంతి బిత్తరపోయారు. స్థానిక మహిళలు, యువకులు గట్టిగా నిలదీయడంతో ప్రచారాన్ని ముగించి అవంతి శ్రీనివాసరావు వెళ్లిపోయారు.