వైస్సార్సీపీ శ్రేణులకు ప్రత్తిపాటి పుల్లారావు వార్నింగ్

తప్పు చేసిన ఏ ఒక్కడ్నీ వదిలిపెట్టబోమని వెల్లడి

tdp-prathipati-pullarao-warns-ysrcp

చిలకలూరిపేట : టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని, తగిన రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఆ రోజులు అతి త్వరలోనే వస్తాయని అన్నారు. “మీరు మా మాట వినరు… ఈసారి మేం కూడా చంద్రబాబు మాట వినం… వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇలాగే ప్రవర్తిస్తే ఒక్కొక్కడి వీపులు పగలడం ఖాయం” అని ప్రత్తిపాటి హెచ్చరించారు.

ఎన్ని జన్మలెత్తినా జగన్ మళ్లీ సీఎం కాలేడు అని స్పష్టం చేశారు. పల్నాడులో ఏడు సీట్లు గెలవబోతున్నామని, రాష్ట్రంలో ఏ పొత్తు లేకపోయినా 160 సీట్లలో విజయభేరి మోగిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను తరిమి తరిమికొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/