‘మా’ ఎన్నికల వేడిని మరింత పెంచిన పూనమ్ కౌర్..

చిత్రసీమ లో ఎన్నడూ లేని వేడి నడుస్తుంది. ఓ పక్క మా ఎన్నికలైతే..మరోపక్క పవన్ కళ్యాణ్ . అసలే ఏపీ సర్కార్ చిత్రసీమ ఫై ఎర్ర కన్నుచేయగా..దానికి మరింత ఎరుపెక్కించాడు పవన్ కళ్యాణ్. సినిమా ఫంక్షన్ లో వైసీపీ సర్కార్ ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఇప్పుడు పవన్ ఫై చిత్ర సీమా సైతం కాస్త ఆగ్రహంగానే ఉంది.

ఇదిలా ఉంటె మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో విష్ణు ప్యానల్ , ప్రకాష్ రాజ్ ప్యానల్ లు పోటాపోటీగా ప్రచారం చేస్తూ అందరి మద్దతు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ తన మద్దతును ప్రకాష్ రాజ్ కు తెలిపి మరింత హాట్ టాపిక్ అయ్యింది. ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆయన గెలవాలి, ఒకవేళ ఆయన గెలిస్తే ఎంతో కాలం నుంచి నేను మాట్లాడుకుండా నోరు మూసుకుని ఉన్నటు వంటి సమస్యలు, నేను పడిన బాధలన్నీ చెబుతాను. చిల్లర రాజకీయాలను చేయని ఏకైక వ్యక్తి ఆయనే. పెద్దలకు గౌరవం ఇస్తూ వారు చెప్పేదానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పుకొచ్చింది.

Want #prakashraj sir to win #maaelections , if he does I will put up the issues I have faced and kept quiet for the longest time , he is the only one who is apolitical and doesn’t get involved in petty politics ,with all due respect to elders will adhere to what they say .Jaihind pic.twitter.com/1lwJDwlLfs— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 1, 2021