తల్లి కాబోతున్న అలియాభట్

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తల్లికాబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన అల్ట్రా సౌడ్ స్కానింగ్‌ రిపోర్టును అందులో పంచుకుంటూ తాను, రణబీర్‌.. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అలియా భట్ ఈ శుభవార్తని ఇన్​స్టాలో పెట్టిన కొద్ది సేపట్లోనే వైరల్​గా మారింది. హాస్పిటల్​లో కన్ఫర్మ్​ అయిన తర్వాత.. బెడ్ పై నుంచి అలియా.. ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. అయితే ఆస్పత్రి బెడ్​ పైన ఉన్న పిక్​తో పాటు.. ఆడసింహం, మగ సింహం తమ బేబీ సింహంతో ఉన్న క్యూట్ ఫొటో కూడా అలియా షేర్ చేసింది.

దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న రన్ బీర్ అలియా జంట రీసెంట్ గా వివాహం చేసుకుంది. ఏప్రిల్ లో వీళ్ల వివాహం జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట హనీమూన్ అంటూ ఎలాంటి టూర్ ని ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడికీ వెల్లలేదు కూడా. ఎవరి సినిమా పనుల్లో వారు గత కొన్ని రోజులుగా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పెళ్లై మూడు నెలలు తిరక్కుండానే అలియా గర్భవతి కావడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.

ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు రణ్ బీర్ అలియా భట్ లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కృతి సనన్ రకుల్ ప్రీత్ కరణ్ జోహార్ టైగర్ ష్రాఫ్ వంటి వారు అలియా జంటకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు. ఇటీవల రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘RRR’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. పాత్ర నిడివి చాలా తక్కువే అయినా తనదైన మార్కు నటనతో సీత పాత్రలో ఆకట్టుకుని ప్రశంసల్ని సొంతం చేసుకుంది. తెలుగులో చేసిన తొలి చిత్రమే పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో అలియాభట్ ని మరిన్ని తెలుగు సినిమాల్లో నటింపజేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేశారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ అలియాభట్ క్రేజీ హీరో రణ్ బీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. హనీమూన్ ని కూడా ప్లాన్ చేసుకోని అలియా భట్ తెలుగులో ప్రపోజల్ లో వున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు తల్లి అయ్యి..ప్రస్తుతం సినిమాలకు దూరం కాబోతుంది.