ఒక్క చాన్స్ నినాదం జనాల్లో బాగా పనిచేసింది..దీపక్‌

జగన్ సర్కారు 34 పథకాలు నిలిపివేసిందని ఆరోపణ

ఒక్క చాన్స్ నినాదం జనాల్లో బాగా పనిచేసింది..దీపక్‌
tdp-mlc-deepak-reddy

అమరావతి: సిఎం జగన్‌ పై టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఒక్క చాన్స్ అంటూ జగన్ లాటరీ కొట్టాడని వ్యాఖ్యానించారు. నాడు పాదయాత్రలో ఒక్క చాన్స్ అంటూ 400 పైగా హామీలు గుప్పించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కారు 34కి పైగా పథకాలను నిలిపివేసిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఏనుగుల మంద గ్రామాలపై పడినట్టు ప్రజల్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ వైఎస్‌ఆర్‌సిపి అధికారంలో ఉండడం వెనుక ప్రత్యేక కారణాలు ఏవీ లేవని, ఒకే ఒక్క చాన్స్ అంటూ జగన్ వేడుకున్నారని, ప్రజలపై అది బాగా ప్రభావం చూపిందని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, 13 జిల్లాలను 13 రాజధానుల్లా అభివృద్ధి చేస్తాం, మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకున్నారని తెలిపారు. పైగా, తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని మభ్యపెట్టారని దీపక్ రెడ్డి విమర్శించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/