వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం

శుక్రవారం రాత్రి నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు

Chandrababu speaking at Nandyala public meeting on Friday night

నంద్యాల: అన్ని పుణ్యక్షేత్రాల నిలయం నంద్యాల అని, నంద్యాల జన సందోహం చూసి చెపుతున్నా .. వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు . ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ ఎంపిగా పని చేసిన నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతి అయ్యారని , ఇక్కడ పోటీ చేసిన పివి నరసింహారావు ప్రధాని మంత్రి అయ్యారని అన్నారు. పివిపై నాడు ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టలేదు. అదీ ఎన్టీఆర్ ఔదార్యం అని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా చెత్త ప్రభుత్వం ఉందని ఈ సండే ఎమ్మెల్యే నంద్యాలలో ఒక్క పని చేశాడా? అని ప్రశ్నించారు. కర్నూలులో మనం ఎయిర్ పోర్టు కడితే…..సిగ్గు లేకుండా జగన్ అతని పేరు పెట్టుకున్నాడని అన్నారు. ఓర్వకల్లులో పారిశ్రామిక వాడ తెచ్చామని, ఇక్కడ అనుకున్న కంపెనీలు వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి అని అన్నారు.
తెదేపా హయాంలో జైన్ ఇరిగేషన్ సిస్టం తెచ్చామని, .సీడ్ పార్క్ తెచ్చామని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా…ఒక్క ఉద్యోగం వచ్చిందా? అని అన్నారు. నాడు రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, తెదేపా ప్రయత్నం అంతా జగన్ వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని తెలిపారు. రూ. 549 కోట్లతో ముచ్చుమర్రి పూర్తి చేసి నాడు నీరు ఇచ్చామని, జగన్ దాన్ని పూర్తిగా ఆపరేట్ చేయలేకపోతున్నాడని అన్నారు. రాయల సీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెబుతూ, సీమలో తెదేపా ప్రభుత్వం 12 వేల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేస్తే…జగన్ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాడని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, నేడు టమాటా ధర పతనమై , రైతులు దెబ్బతిన్నారని తెలిపారు. ఆడబిడ్డలు నిత్యావసరవస్తువులు కొనే పరిస్థితిలో లేరని , ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కరెంట్ చార్జీలు 8 సార్లు పెరిగాయని అన్నారు. రూ. 200 కరెంట్ బిల్లు నేడు రూ. 1000 అయ్యిందని , వెయ్యి వచ్చే కరెంట్ బిల్లు నేడు రూ. 5 వేలు అయ్యిందన్నారు.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/