ఇజ్రాయోల్‌ ప్రధాని సౌదీలో రహస్య పర్యటన!

israeli-pm-benjamin-netanyahu

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజామిన్ నెత‌న్యాహు ఆదివారం ర‌హ‌స్యంగా సౌదీలో ప‌ర్య‌టించారు. ఈ విష‌యాన్ని సోమ‌వారం ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ పబ్లిక్ రేడియో, ఆర్మీ రేడియో వెల్ల‌డించాయి. పర్యటనలో నెత‌న్యాహు సౌదీ యువ‌రాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌, అమెరికా విదేశాంగ కార్య‌ద‌ర్శి మైక్ పాంపియోల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అయితే, సౌదీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి నెత‌న్యాహు కార్యాల‌యంగానీ, జెరూస‌లెంలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంగానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా, ఈ మూడు దేశాల‌కు సంబంధించిన కీల‌క నేత‌లు ర‌హ‌స్యంగా స‌మావేశమై ఏ విష‌యంపై చ‌ర్చించార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/