రోడ్డుపై రాజధాని రైతుల మానవహారం

న్యాయం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: విత్తన ప్రాప్తి రహదారిపై రాజధాని రైతులు మానవహారం నిర్వహించారు. మందడం సెంటర్ నుంచి రాయపూడి సెంటర్ వరకు రోడ్డుకు రైతులు, మహిళలు ఒక‌వైపు నిలబడ్డారు. ఇదే మార్గంలో హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి వెళుతున్నారు. ఆయనకు శాంతియుతంగా నమస్కరిస్తూ.. తమ మొర ఆలకించి న్యాయం‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. మా జీవితాలను ప్రభుత్వం వీధులపాలు చేసిందన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో న్యాయమూర్తులను వేడుకుంటున్నామని రైతులు, మహిళలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/