ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని రాష్ట్ర నాయకుడిని చేశారుః అనిల్ కుమార్

లోకేశ్ ఓ మాలోకమన్న అనిల్ కుమార్ యాదవ్

tdp-loosing-its-value-with-nara-lokesh-padayatra-says-anil-kumar-yadav

అమరావతిః టిడిపి నేత నారా లోకేశ్ పై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పులకేశి లోకేశ్ ఒక మాలోకమని అన్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోతోందని ఎద్దేవా చేశారు. పులకేశి దెబ్బకు ఆ పార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. లోకేశ్ పాదయాత్రతో టిడిపికి ఉన్న పరువు కూడా పోతోందని చెప్పారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ ను రాష్ట్ర నాయకుడిని చేశారని అన్నారు.

175 స్థానాల్లో పోటీ చేస్తామని తమ నాయకుడు జగన్ చెప్పారని… దమ్ముంటే లోకేశ్ కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పొత్తు లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లలేరని… జగన్ మాత్రం సింహంలా, సింగిల్ గా ముందుకు సాగుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. టిడిపి, జనసేనలు అడ్రస్ లేకుండా పోతాయని చెప్పారు.