తారకరత్న దిన కర్మ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన సినీ , రాజకీయ ప్రముఖులు

నందమూరి తారకరత్న దిన కర్మ ఈరోజు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో విషాదం నెలకొంది.
ఇక తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం ఈరోజు ( మార్చి 2వ తేదీన) హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వ్హయించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. అలాగే చిత్రసీమ నుండి కూడా పెద్ద ఎత్తునే ప్రముఖులు హాజరై తారకరత్న కు నివాళ్లు అర్పించారు.