కోనసీమ జిల్లాలో దారుణం : ఫస్ట్ నైట్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన భర్త

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. సోషల్ మీడియా లో పోస్టుల ద్వారా డబ్బులు వస్తుండడం తో ఏవి పడితే అవి పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఏకంగా తన మొదటి రాత్రి ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి కటకటాలపాలయ్యాడు ఓ నవ వరుడు.

వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫిబ్రవరి 8న.. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. పెళ్లి తర్వాత ఎంతో ముచ్చటగా మొదటి రాత్రి జరిగింది. ఆ తర్వాత మొదటి రాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం కాస్త వధువు కుటుంబానికి తెలియడంతో.. వధువు తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే దాని గురించి పోలీసులు విచారించగా..ఈ దారుణమని పాల్పడింది వరుడే అని తెలిసి షాక్ అయ్యారు.

తమ మొదటి రాత్రి దృశ్యాలను సీక్రెట్‌గా రికార్డు చేసి.. దాన్ని అతడే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. విషయం తెలుసుకున్న పోలుసులు అతడిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఘటన గురించి తెలియగానే పెద్ద మనుషులు పంచాయతీలో సెటిల్‌ చేసే ప్రయత్నం చేసినప్పటికీ , వధువు తల్లి.. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాక.. ఇక్కడ వధువు మైనర్‌ అని తెలుస్తోంది. దాంతో బాల్య వివాహం నేర కనుక.. దీనిపై ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, వివాహం చేసిన వ్యక్తి ఫై కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.