టిడిపి నేతలు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారు

టిడిపి నేతల మాటలు ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరు

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: కొంతమంది పింఛనుదారులను తొలగించామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. పింఛన్లపై ప్రతిపక్ష టిడిపి పార్టీ అనాలోచిత ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. తాము జన్మభూమి కమిటీలలా వసూలు దందా నడపలేదని దుయ్యబట్టారు. టిడిపి నేతల మాటలను ప్రజల నమ్మె పరిస్థితి లేదని బొత్స స్పష్టం చేశారు. పింఛను దారుల సంఖ్యను తగ్గించామని ఆ పార్టీ నేతలు ఆరోపించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసూ..దాన్నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఇంకా అర్హులైన పేదలందరికి ఇంటివద్దకే పింఛన్లను అందించే విధానాన్ని వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై లబ్ధిదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హులను గుర్తించడంలో పొరబాట్లైమైనా ఉంటే త్వరలో సరిదిద్ది వారికి కూడా పింఛన్లు ఇస్తామని బొత్స తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/