శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా , అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగామం మండలం పెద్ద తామరాపల్లి సమీపంలో పశ్చిమ బెంగాల్‌ నుండి కేరళకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది.

దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 39 మంది ఉన్నారు. క్షతగాత్రులను టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఫై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.