మోడీపై వైస్ షర్మిల ఆగ్రహం..

ఆదివారం చిలకలూరి పేట లో జరిగిన కూటమి ప్రజాగళం సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ ఫై చేసిన కామెంట్స్ ఫై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. అటు జగన్ను, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ. పదేండ్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అంటూ ఆగ్రహించారు షర్మిల.

ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ళ అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందిస్తూ, ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో అంటూ చురకలు అంటించారు.