రాజధాని మార్పుపై జవాబు చెప్పండి

ఓ సామాన్య మహిళ ప్రశ్నిస్తున్న వీడియో పోస్టు చేసిన నారా లోకేశ్‌

Nara lokesh
Nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో ఓ మహిళ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. తాజాగా ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యమంలో పాల్గొన్న ఓ మహిళ మాట్లాడిన వీడియోను నారా లోకేశ్‌ పోస్లు చేశారు. అందులో ఓ మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా రాజధాని మార్పుపై ఈ సామాన్య మహిళ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ ఓ విఫలమైన ముఖ్యమంత్రని ట్యాగ్ లైన్ పెట్టారు. వీడియోలో ఓ మహిళ.. జీఎన్ రావు కమిటీ నివేదికను సిఎం జగన్ చదవలేదని అర్థమైందంటూ పేర్కొంటూ.. నివేదికను వాళ్లిష్టమొచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించింది. విశాఖలో వైఎస్‌ఆర్‌సిపి నేతలకు భూములున్నాయనే అక్కడికి రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా మండలి రద్దు, రైతుల ఉద్యమంపై ఆ మహిళ ప్రభుత్వ వైఖరిని విమర్శించింది.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/