వైస్సార్సీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని కితాబు

అమరావతి : విజయనగరం జిల్లా ఎస్.కోట టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరారు. ఆమెను పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మీడియాతో హైమావతి మాట్లాడుతూ..మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని కొనియాడారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందని అన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారని ప్రశంసించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చే వైసీపీలో చేరానని తెలిపారు. విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు జగన్ చేస్తున్నారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/