డాలర్ శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటు : చంద్రబాబు

అమరావతి : డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటన్నారు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారని, ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. శేషాద్రి తన చివరి క్షణంలోనూ స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/