బొగ్గు టిప్పర్​, వ్యాను ఢీకొని ఇద్దరు మృతి

కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బొగ్గు టిప్పర్, వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వారిని సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/