ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం ఫై జగన్ ను తప్పుపట్టిన షర్మిల

తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అన్నట్లు షర్మిల ..సొంత అన్నపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం ముమ్మాటికీ తప్పే అని అలా ఎన్ని రోజుల మార్చుకుంటూ పోతారని నిలదీశారు. బుధువారం ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై యావత్ టీడీపీ నేతలు , పార్టీ కార్యకర్తలే కాక నందమూరి కుటుంబ సభ్యులు , ఇతర పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి , కాంగ్రెస్ , జనసేన తో పాటు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చిన పరిగి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, ఆశీర్వాదంతో తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తా. వైయస్ రాజశేఖర రెడ్డిలాగే పరిపాలిస్తా. ప్రజల కష్టాలు తీరుస్తా అని అన్నారు. అలాగే పరిగి ఎమ్మెల్యే, ఆయన తమ్ముడికి భూములు తినడం ఇష్టమట. అసైన్డ్ భూములు, ఆలయ భూములు, ప్రభుత్వ భూములు ఇలా వేటినీ వదలరట. ఎంత సంపాదించుకున్నా సరిపోదట. హాస్టల్ భోజనంలో కప్పలు, బొద్దింకలు, పురుగులు వస్తున్నాయని పిల్లలు గగ్గోలు పెడుతున్నా కనీసం పలకరించడట అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.